పీఎంవోలో కాపురాలు పెట్టుకోండి

Submitted by lakshman on Thu, 03/22/2018 - 17:31
I don't need Chandrababu's nod to go to PMO: Vijay Sai Reddy

ఏ1 ఏ2 నిందితులకు ప‌విత్ర‌మైన పీఎంవో కార్యాల‌యంలో ఏం ప‌నిఅంటూ సీఎం చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్ లో విమ‌ర్శించారు. అంతేకాదు పీఎం వో చుట్టూ విజ‌య్ సాయిరెడ్డి ఎందుకు ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారని అని అన్నారు. పీఎంవోలో విజ‌య్ సాయి మ‌కాం వెనుక సంకేతాలేంటి అని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రధాన నిందితులు ప్రదక్షిణలు చేస్తున్నారని, దీని ద్వారా ఏ సంకేతాలు పంపుతున్నారు... ఏదైనా విషయాలు ముందుగా మిత్రపక్షాలకు తెలుస్తాయి.., అలాంటిది కేంద్రంలో అన్ని అంశాలు వైసీపీకే ముందు ఎలా తెలుస్తున్నాయి..?, రాజీనామాలపై సభలో ప్రకటనలు చేయడానికి కేంద్రమంత్రులకు అవకాశం ఇవ్వరా.., ప్రధాన నిందితులను మాత్రం పదేపదే కలుస్తారా.., దీని అర్ధం ఏమిటి.., నీరవ్‌మోడీలాంటి నిందితులు దేశం దాటిపోతున్నారు.... విజయసాయిరెడ్డిలాంటి వాళ్లు పీఎంవోలో తిరుగుతున్నారు... వీటిద్వారా ఏ సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారని చంద్రబాబు అన్నారు. 
ఈ వ్యాఖ్య‌ల‌పై విజ‌య్ సాయిరెడ్డి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.  చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానమంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని చెప్పారు.కేంద్రం నాలుగేళ్లలో ఇచ్చిన రూ.1.25 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని ఉద్ఘాటించారు. ప్రధాని మోడీని తన ఇష్టం వచ్చినన్నిసార్లు కలుస్తానని స్పష్టం చేశారు. 
విజ‌య్ వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు మ‌రోమారు స్పందించారు. న‌న్నుబోనులో ఎక్కించే వ‌ర‌కు నిద్రపోన‌న్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మాట‌లు మీకు బాధ‌గా అనిపించ‌లేదా అని సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో మాట్లాడిన చంద్ర‌బాబు బీజేపీ - వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. బీజేపీ చ‌వ‌క‌బారు రాజ‌కీయాలు చేస్తోంద‌ని అని వ్యాఖ్యానించారు. మాజీ నేర‌స్తుడు సీబీఐ డైర‌క్ట‌ర్ ను క‌లిస్తే కేసుపెట్టార‌ని గుర్తు చేశారు. అలాంటి నేర‌స్తుల‌కు పీఎంవో గ‌స్తీ కాస్తుంద‌ని విమ‌ర్శించారు. ఒక అవినీతిప‌రుడు మోడీని క‌లిస్తే ఎలా అర్ధం చేసుకోవాల‌ని అన్నారు. నేర‌స్తులు పీఎంవోకు రాకూడ‌దు. కానీ అవినీతి ప‌రులు పీఎంవో చుట్టుతిప్పుకోవ‌డమే కాదు. కాపురాలు పెట్టుకున్నా అభ్యంత‌రం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

English Title
I don't need Chandrababu's nod to go to PMO: Vijay Sai Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES