హైదరాబాద్‌లో ఐ20 గ్యాంగ్...కారులో రెక్కీ, ఆ తర్వాత దోపిడీలు, దొంగతనాలు

హైదరాబాద్‌లో ఐ20 గ్యాంగ్...కారులో రెక్కీ, ఆ తర్వాత దోపిడీలు, దొంగతనాలు
x
Highlights

హైదరాబాద్‌ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ గ్యాంగ్ పగలు ,రాత్రి అని తేడా లేకుండా ఇళ్ళను గుల్ల చేస్తోంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ...

హైదరాబాద్‌ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ గ్యాంగ్ పగలు ,రాత్రి అని తేడా లేకుండా ఇళ్ళను గుల్ల చేస్తోంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ పేరు చెబితే హడల్. ఒక్కో చోరికి రెండు రోజులే టార్గెట్ టార్గెట్ పెడితే ఆ ఇంట్లో ఉన్న సొమ్ము మాయం కావాల్సిందే ప‌గ‌లంతా తాళాలు వేసిన ఇళ్లకోసం రెక్కీ నిర్వ‌హిస్తారు. అసలు ఈ గ్యాంగ్ పేరు ఏంటి ? వీరు చేసే చోరీలు ఎలా ఉంటాయి అని తెల్సుకోవాలనుకుంటున్నారా !

ఇప్పటి వరకు పేరు మోసిన చెడ్డి గ్యాంగ్.. పార్థీ గ్యాంగ్ పేర్లే విన్నాం తాజాగా ఐ20 గ్యాంగ్ కూడా నగరం లోకి ప్రవేశించింది రాజ‌ధాని దిల్లీ కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో దోపీడీలు చేయ‌డంలో దిట్ట‌గా వ్య‌వ‌హరించింది ఐ20 గ్యాంగ్. ఢిల్లీలో స్టార్ట్ చేసి దొంగ‌త‌నాలు రూట్ మార్చి ట్విన్ సిటీ వైపు వ‌చ్చిచేరారు. వ‌చ్చి రాగానే భారీ చోరీల‌కు తెరలేపారు. పగలు రాత్రి అని తేడా లేకుండా రెక్కి చేసి రెండు రోజుల్లో ఒకటి అంటూ టార్గెట్ పెట్టుకొని చోరీలు చేస్తుంది ఈ ముఠా ఐ20 కారులో రావడం రెక్కి చేయడం , దోపిడీలు , దొంగతనాలు చేయడం ఇక్కడ నుండి పరారవ్వడం ఆనావాయితీగా పెట్టుకుంది భాగ్య నగరం లో ఇప్పటి వరకు 13 చోరీలు , దోపిడీలు చేసింది ఈ అంతరాష్ట్ర ముఠా .

ముఠా పై నిఘా పెట్టిన వెస్ట్ పోలీసులు మూడు నెలలలో వీరీ ఆటకట్టించారు వరుస దొంగ తనాలు చేస్తున్న ఈ ఐ20 ముఠా ను అరెస్ట్ చేశారు. ఏడుగురు గ్యాంగ్ సభ్యుల్లో శంషాద్ అలియాస్ బురా, ఆరీఫ్ అలియాస్ ముస్త‌ఖీమ్, మహ‌మ్మ‌ద్ వ‌సీ అలియాస్ న‌దీమ్ ర‌హీమ్ ఖురూషీ లు అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. ముఠాలోని ప్ర‌ధాన నిందితుడు వ‌సీ అలియాస్ న‌దీమ్ పై 70 కు పైగా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. కొత్త గ్యాంగ్ లు పుట్టుకొస్తున్న క్ర‌మంలో సిటీపోలీసుల‌కు స‌వాల్ గా మారుతోంది. న‌యా గ్యాంగ్ ల‌పై నిఘా పెట్టిన పోలీసులు ఇప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories