రూ.అయిదు లక్షల జీతమిచ్చే ఉద్యోగం వదిలేశా : హైపర్ ఆది

Submitted by arun on Mon, 04/16/2018 - 13:20
Hyper Aadi

"ఎవరినైనా సరే ఏడిపించడం చాలా తేలిక .. కానీ నవ్వించడం మాత్రం చాలా కష్టం. అలాంటిది అందరినీ నవ్వించే శక్తిని దేవుడు నాకిచ్చాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను .. ఆదరణ లభిస్తున్నందుకు ఆనందిస్తున్నాను" అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ 'జబర్దస్త్' హైపర్ ఆది అన్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్ వేస్తూ.. టీవీ ముందు కూర్చున్న వాళ్లను కితకితలు పెట్టించడంలో ఇతగాడు మహా దిట్ట. షో మొదలైందంటే చాలు హైపర్ ఆది కామెడీ ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఆతృత మొదలవుతుంది ప్రేక్షకుల్లో. నవ్వులతో విందు ఇచ్చే ఈయన మాత్రం తన నిజ జీవితంలో చాల కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. తాజాగా జరిగిన ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఈయన తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.
 
" నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. 'అదిరే అభి' చేయడం వలన 'జబర్దస్త్' వేదికపైకి రాగలిగాను. ఆ తరువాత ప్రేక్షకులు ఆదరించడంతో టీమ్ లీడర్ కాగలిగాను. ఇంతవరకూ 'జబర్దస్త్'లో 100 స్కిట్లు పూర్తి చేశాను. రచన వైపు .. నటన వైపు రావడానికి ముందు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా రెండు సంవత్సరాలు పనిచేశాను. ఏడాదికి 5 లక్షలు వస్తున్నా జీవితంలో ఏదో వెలితిగా అనిపించడంతో, నాకు ఇష్టమైన ఈ రంగానికి వచ్చాను.  ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా జనం నన్ను గుర్తుపడుతున్నారు .. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.  
 

English Title
Hyper Aadi says about his life

MORE FROM AUTHOR

RELATED ARTICLES