బిగ్ బ్రేకింగ్ :హైదరాబాద్‌ జంటపేలుళ్ల కేసులో ఇద్దరికీ ఉరి శిక్ష

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 18:17
hyderabad-twin-bomb-blast-case

2007 ఆగస్టు 25 హైదరాబాద్‌ జంటపేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. ఇప్పటికే ముగ్గురిని దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. అనీక్‌ షఫీక్‌, 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల తీర్పు వెలువరించింది  సయాద్‌, ఈ కేసులో నిందితులుగా ఉన్న  ఏ1 గా ఉన్న అనీక్‌ షఫీక్‌, ఏ2 గా ఇస్మాయిల్ లకు ఉరిశిక్ష విధించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో నిందితుడు తారిఖ్ అంజుమ్‌కు జీవితఖైదు విధిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది.  ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రియాజ్‌ భత్కల్‌, ఇక్భాల్‌ భత్కల్‌, అమీర్‌ రెజాఖాన్‌లు పరారీలో ఉన్నారు. 

కాగా  2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో  తొలుత లుంబిని పార్క్‌లో , ఆ తర్వాత గోకుల్ చాట్‌లో  జంటపేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, 65 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.  దాంతో పదకొండేళ్ళుగా విచారణ జరుగుతూనే వచ్చింది. తాజాగా ఇద్దరు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేయడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. 

English Title
hyderabad-twin-bomb-blast-case

MORE FROM AUTHOR

RELATED ARTICLES