నేటి నుంచి ఏపీ ఎంసెట్‌

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌
x
Highlights

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్‌–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అయి.. ఈ నెల...

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్‌–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అయి.. ఈ నెల 24 వరకు జరుగుతాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సాయిబాబు తెలిపారు. ఎంసెట్ పరీక్షలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86,910 మంది మొత్తంగా 2,82,633 మంది

పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాదులో నిర్వహించనున్నామని సాయిబాబు తెలిపారు. హాల్‌టికెట్‌ వెనుక విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని రూట్‌ మ్యాప్‌ ద్వారా పొందుపర్చినట్లు కూడా ఆయన చెప్పారు. పరీక్షకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884–2340535, 0884–2356255 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లో కేటాయించిన తేదీ, సమయము కంటే గంట ముందుగానే హాజరు కావాలని సూచించారు. నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories