దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు... ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు... ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
x
Highlights

ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు....

ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. రంజాన్ పర్వదినం శాంతికి చిహ్నమని ఇస్లాం మతపెద్దలు చెబుతుంటారు.

నెల రోజులుగా చేస్తున్న ఉపవాసాలకు నేడు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో మహ్మదీయ సోదరులు నేడు రంజాన్ పర్వదినం జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. పేదలకు దాన ధర్మాలు చేస్తారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభకాంక్షలు తెలుపుకుంటారు.

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, మసీదులను అందంగా అలంకరిచారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, తెలుగు రాష్ట్రాల సీఎంలు ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories