గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులు ఎక్కడా

Submitted by lakshman on Fri, 12/22/2017 - 19:51

రాజధానిలో నడిరోడ్డుపై ఓ యువతిని పెట్రోల్ పోసి తగలబెడుతుంటే.. అడ్డుకునేందుకు అక్కడ ఎవరూ లేరా..? ఆ కిరాతకుడిని ఎందుకు అడ్డుకోలేదు..? ఉన్నా ప్రేక్షక పాత్ర ఎందుకు వహించారు..? పోలీసులేం చేస్తున్నారు? ఇంత దారుణాన్ని ఎవరూ ప్రతిఘటించలేకపోవడం అందర్నీ కలచివేస్తోంది. 
 ప్రేమ వ్యవహారంలో సంధ్యారాణి అనే యువతిని రాజధానిలో నడిరోడ్డుపై ఉన్మాది తగలబెట్టేశాడు. ఆ తర్వాత దర్జాగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. నడిరోడ్డుపై ఇంత ఘోరం జరుగుతుంటే అక్కడున్నవారు ఏం చేస్తున్నారు...? మనకెందుకులే అని ఎందుకు ఉండిపోయారు. ? 
 ఈ ఘటన ఎక్కడో మారుమాల ప్రాంతంలో  జరిగిందంటే అర్ధముంది. కానీ, హైదరాబాద్ నగరంలో అందరూ చూస్తుండగా  పెట్రోలు పోసి తగలబెడుతుంటే పోలీసులు ఎక్కడున్నారు..?  ఆ రోడ్డుపై వెళ్తున్న వారు ఏం చేస్తున్నారు..? ఇప్పుడు ఆ ప్రశ్నలే అందరిలో తలెత్తుతున్నాయి. 
 మహిళల రక్షణ కోసమే పనిచేస్తున్నామంటున్న షీ టీమ్స్, గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులు ఇప్పుడేమై పోయారు. అంతా అయ్యాక మేమున్నామంటున్న పోలీసులు నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 
 ఒక్క హైదరాబాద్‌లోనే చూస్తే.. మొన్న చాందినీ జైన్, ఇవాళ సంధ్యారాణి ప్రేమోన్మాదుల ఘాతుకానికి బలైపోయారు. ఎంకెంతమంది బలైతే ప్రభుత్వం, ప్రజలు స్పందిస్తారు. 
 


 

English Title
Hyd woman Sandhya Rani's murderer a deranged stalker, man who couldn't take a 'No'

MORE FROM AUTHOR

RELATED ARTICLES