బౌండేడ్ స్క్రిప్ట్ లేకుంటే మహేష్ ఒకే చెప్పడం లేదట ..!

బౌండేడ్ స్క్రిప్ట్ లేకుంటే మహేష్ ఒకే చెప్పడం లేదట ..!
x
Highlights

బ్రహ్మోత్సవం సినిమా తరవాత మహేష్ బాబు మొహమాటం పూర్తిగా వదిలేసాడు .. ఒక్క హిట్టు ఇచ్చారు కదా కానీ తరవాత సినిమా స్టొరీ లైన్ చెబితే కమిట్ అయ్యే ఆలోచనలో...

బ్రహ్మోత్సవం సినిమా తరవాత మహేష్ బాబు మొహమాటం పూర్తిగా వదిలేసాడు .. ఒక్క హిట్టు ఇచ్చారు కదా కానీ తరవాత సినిమా స్టొరీ లైన్ చెబితే కమిట్ అయ్యే ఆలోచనలో లేడట ఈ సూపర్ స్టార్ .. ఎంత పెద్ద దర్శకుడు అయిన సరే బౌండేడ్ స్క్రిప్ట్ తో వచ్చి మహేష్ ని మెప్పిస్తేనే సినిమాకి ఒకే అంటున్నాడట మహేష్ బాబు ..

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహేష్ బాబు మరియు సందీప్ వంగ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి . ఈ క్రమంలో సందీప్ కూడా మహేష్ కి స్క్రిప్ట్ లైన్ కూడా చెప్పేసాడు సందీప్ . పూర్తి స్క్రిప్ట్ తయారుచేసుకొని రమ్మనాడట మహేష్ కానీ ఈ టైంలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు సందీప్ వంగ ..

ఇక మహేష్ కూడా సందీప్ సినిమా కోసం వెయిట్ చేయకుండా మహర్షి , సరిలేరు నికేవ్వరు సినిమాలకు కమిట్ అయ్యారు .. అయితే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ ఉంటుందా లేదా అన్న చర్చ తెరపైకి వచ్చింది . కబీర్ సింగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సందీప్ ని ఈ ప్రశ్న అడగగా ఇప్పటికే మహేష్ కి లైన్ వినిపించనని పూర్తి స్క్రిప్ట్ అయ్యాక మహేష్ దగ్గరికి వెళ్తానని చెప్పుకొచ్చాడు .. మరి సందీప్ బౌండేడ్ స్క్రిప్ట్ కి మహేష్ ఒకే అంటాడో లేదో చూడాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories