కర్నూలు జిల్లాలో దారుణం...పెళ్లాం పిల్లల్ని అమ్మకానికి పెట్టిన భర్త

Submitted by arun on Thu, 06/28/2018 - 11:19

నాడు సత్యం కోసం భార్యా పిల్లలను అమ్మేశాడు సత్య హరిశ్చంద్రుడు. ఇప్పడు జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు భార్య, పిల్లల్ని అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా వెంకటమ్మ, పసుపులేటి మద్దిలేటి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఆటో నడిపే మద్దిలేటి  ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జల్సాల కోసం అప్పులు చేస్తూ భార్యాపిల్లల్ని వేధిస్తున్నాడు. 

గత ఏడాది అప్పులు తీర్చేందుకు మద్దిలేటి రెండో కూతుర్ని బంధువులకు లక్షన్నర రూపాయలకు అమ్మేశాడు. బాండ్ కూడా రాసి ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న వెంకటమ్మభర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలతో సహా నంద్యాలకు వచ్చి తలదాచుకుంటోంది. 

రెండో కూతుర్ని అమ్మేసిన మద్దిలేటి మిగతా సంతానం, భార్యపై  దృఫ్టి పడింది. మూడు, నాలుగో కూతురుతో పాటు భార్యను 11 లక్షల రూపాయలకు అమ్మేందుకు తన సొంత అన్నయ్యతో బేరం కుదుర్చుకున్నాడు. బాండ్ పేపర్ పై సంతకం చేసేందుకు నిరాకరించిన వెంకటమ్మను మద్దిలేటి చితకబాదాడు. భర్త అమానుషాన్ని భార్య వెంకటమ్మ తెలివిగా బయటపెట్టింది. భర్త చేస్తున్న మైనర్ కూతురి వివాహాన్ని ఆపాలంటూ ఆమె ఐసీడీఎస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. కానీ అధికారులు సీన్‌లోకి ఎంట్రీ అయ్యే సరికి అసలు విషయం గుట్టు రట్టయ్యింది.  ఐసీడీఎస్ అధికారుల రాకతో మద్దిలేటి పారిపోయాడు. వెంకటమ్మ ఇద్దరు పాపలను చైల్డ్ప్ ప్రొటెక్షన్ హోంకు తరలించి, మద్దిలేటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

English Title
Husband Sale His Wife And Children

MORE FROM AUTHOR

RELATED ARTICLES