ఆడ పిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాక్

Submitted by arun on Mon, 02/05/2018 - 16:48
Rajaratnam

ఆడ పిల్ల పుట్టిందని.. భార్యకే భర్త కరెంట్ షాక్ ఇచ్చిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవలే చోటు చేసుకుంది. పెనమలూరులోని పెద్దగుడి ప్రాంతానికి చెందిన ఎస్. రాజారత్నం.. అదే ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే యువతిని ప్రేమించి నాలుగు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఈ వ్యక్తికి గతంలోనే వివాహమైంది. మొదటి భార్యకు విడాకులిచ్చి.. ప్రశాంతిని పెళ్లి చేసుకున్నాడు. 

రెండేళ్ల క్రితం వీరిద్దరికి మగబిడ్డ పుట్టాడు. మళ్లీ ఈ ఏడాది జనవరి 28న పండంటి ఆడబిడ్డకు ప్రశాంతి జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టిందని రాజారత్నం.. ప్రశాంతిని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. ఫిబ్రవరి 1న నిద్రపోతున్న ప్రశాంతి చేతికి విద్యుత్ వైర్లు చుట్టి స్విచ్ వేశాడు. కరెంట్ షాక్‌తో తేరుకున్న ప్రశాంతి గట్టిగా కేకలు పెట్టడంతో భర్త రాజారత్నం పరారైయ్యాడు. అయితే ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 498ఏ కింద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు విత్ డ్రా చేసుకోక పోతే చంపుతానని నా భర్త బెదిరిస్తున్నాడని, భయంతో సొంత బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నామని భార్య వాపోతుంది. శాడిస్ట్ భర్త బారి నుంచి కాపాడాలని భార్య పోలీసులను వేడుకుంటోంది.

English Title
husband gave electrocute wife for giving birth to girl

MORE FROM AUTHOR

RELATED ARTICLES