భర్తకు ప్రియుడితో చేసిన పాడుపని వీడియోలు..

Submitted by arun on Fri, 03/16/2018 - 16:06
Marriage

కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే జగిత్యాల మండలం ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో ధర్మారావు పేటకు చెందిన ధర్మరాజు (27)కు పెళ్లయింది. కానీ, ఆ పెళ్లికి ముందే ఆమె తన పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మహేశ్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగించింది. భర్త అంటే ఏ మాత్రమూ ఇష్టం లేని నాగలక్ష్మి.. భర్త ముందే ప్రియుడితో గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడేది. పుట్టింటికి వెళ్లినప్పుడల్లా ప్రియుడిని కలిసేది. దాని గురించి తెలిసి భర్త నిలదీసిన నాగలక్ష్మి మాత్రం మారలేదు. మళ్లీ అదే రీతిలో వ్యవహారం నడిపింది. నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన నాగలక్ష్మి.. ఆ తర్వాత భర్త ఫోన్లకు స్పందించలేదు. అత్తింటివారు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు.

అయితే, భర్తకు వాట్సాప్‌లో ఆమె తన ప్రియుడితో కలిసి అత్యంత అసభ్యకరంగా, సన్నిహితంగా ఉన్న వీడియోలను పంపింది. అంతేకాదు, భర్త కట్టిన తాళిని తీసి తన ప్రియుడితో వేయించుకుంది. ఆ వీడియోలు చూసిన ధర్మరాజు తీవ్రంగా కుమిలిపోయాడు. విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. దానిని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. కాగా, నాగలక్ష్మి తీరు పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి ఉండాల్సిందని, కానీ, ఇలాంటి పాడు పనులు చేసి ఓ మంచి వ్యక్తి ప్రాణాలు తీయడమేంటని ఆమెపై మండిపడుతున్నారు. నాగలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
husband committs suicide after wife sends her marrige video

MORE FROM AUTHOR

RELATED ARTICLES