అనుమానంతో భార్యను ఇంట్లో నిర్బంధించి...

Submitted by arun on Thu, 06/07/2018 - 14:17
brutally attacked

కట్టుకున్న భార్యకు.. ప్రత్యక్ష నరకాన్ని చూపించాడో భర్త. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడకు చెందిన రాజుకు.. 14 నెలల క్రితం బేతంచెర్ల మండలం గుంటుపల్లె గ్రామానికి చెందిన లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన పది రోజుల నుంచే భార్యను హింసించడం మొదలుపెట్టాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. కర్రలతో కొట్టడమే కాకుండా.. ఒళ్లంతా వాతలు పెట్టడంతో.. లక్ష్మీని తీవ్రంగా గాయపర్చాడమే కాకుండా.. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజును అరెస్ట్ చేసి.. బాధితురాలిని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 

English Title
husband brutally attacked wife

MORE FROM AUTHOR

RELATED ARTICLES