కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు..15 మందికి ఏపీ కేబినెట్‌లో..

కేబినెట్ కూర్పుపై జగన్ కసరత్తు..15 మందికి ఏపీ కేబినెట్‌లో..
x
Highlights

కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. జూన్ 7 లేదా 8 తేదీల్లో ఏపీ కేబినెట్ కొలువుదీరనున్నట్టు తెలుస్తోంది. 13 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం...

కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. జూన్ 7 లేదా 8 తేదీల్లో ఏపీ కేబినెట్ కొలువుదీరనున్నట్టు తెలుస్తోంది. 13 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా సుమారు 15 మందికి ఏపీ కేబినెట్‌లో చోటు కల్పించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. సుమారు ఐదుగురు సీయనిర్లతో పాటు కొత్తవారికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్‌లో అవకాశం కల్పించే దిశగా ఏపీ మంత్రివర్గ కూర్పు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

నిన్న ఏపీ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జూన్7 లేదా 8న ఏపీ కేబినెట్‌ను ప్రకటించనున్నారని సమాచారం. మొదటిసారిగా 15మందికి జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, అన్ని జిల్లాల ప్రాతినిధ్యం, సీనియర్లకు ప్రాధాన్యం ఇలా పలు అంశాల ప్రాతిపదికగా మంత్రివర్గ కూర్పు జరగనుంది.

జూన్‌ మూడో తేదీనే మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అయితే, పార్టీ ముఖ్యనేతలు కొందరు మాత్రం జూన్‌ 7న మంత్రివర్గం ఏర్పాటవుతుందని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న వైసీపీలో మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై 24 గంటలు ముందుగానే సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసే వీలుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్‌ ఏర్పాటయ్యాక శాసనసభా సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే జగన్ కోసం సచివాలయంలో మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. అలాగే మంత్రుల చాంబర్లను సైతం సిద్ధం చేసేందుకు అమరావతిలో చకచకా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories