పిల్లల్లో బరువు తగ్గాలంటే ఇలా..

పిల్లల్లో బరువు తగ్గాలంటే ఇలా..
x
Highlights

సాదరంగా వయసును బట్టి పిల్లల శరీర ఆకృతిలో మార్పు ఉంటుంది. కానీ కొంతమంది వయసుతో పనిలేకుండా విపరీతమైన బరువు పెరుగుతారు. అది వంశపారంపర్యం కావొచ్చు.. శరీర...

సాదరంగా వయసును బట్టి పిల్లల శరీర ఆకృతిలో మార్పు ఉంటుంది. కానీ కొంతమంది వయసుతో పనిలేకుండా విపరీతమైన బరువు పెరుగుతారు. అది వంశపారంపర్యం కావొచ్చు.. శరీర అవయవాల్లో మార్పు కావొచ్చు.. మాములుగానే చిన్నపిల్లలలో జీర్ణప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. దాంతో వారికి ఆకలి ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఇదిలావుంటే చాలా మంది తలిదండ్రులు తమ పిల్ల‌లు బ‌రువు ఎక్కువగా ఉన్నార‌ని మ‌థ‌న‌ప‌డుతుంటారు. అయితే వారికీచక్కటి ఉపాయాలు చెబుతున్నారు శాస్త్రవేత్తలు..చిన్నపిల్లలు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటే లావు కారని చెపుతున్నారు. ప్రతి ముద్దను 30 సెకన్లపాటు బాగా నమలాలంటున్నారు. దీనివల్ల పిల్లలకు కడుపు నిండినట్టు ఉంటుందిట. దీంతో పిల్లలు అతిగా తినరట.. దాని వలనఊబకాయం రాదు. అంతేకాకుండా లావు ఎక్కువగా ఉండే పిల్లలు సర్వసాధారణంగా బరువు తగ్గాలంటే తినడం తగ్గించాలని సూచిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ అ పని చేయడం అనుకున్నంత సులభం కాదు. దీనికి ఓ ఉపాయం చెబుతున్నారు. పార్కులు, ఓపెన్ ప్లేస్ లలో వారిని రోజుకు అరగంటపాటు నడిపించాలట.అలా చేయడం వలన ఆహరం త్వరగా జీర్ణమయి.. 200 కేలరీల కొవ్వు కరగుతుందని అంటున్నారు. ఎక్కువగా చిన్నపిల్లలకు జంక్ ఫుడ్ ను అలవాటు చేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories