చుండ్రు ప్రతిరోజు వస్తుందా.. అయితే ఇలా చేయండి..

చుండ్రు ప్రతిరోజు వస్తుందా.. అయితే ఇలా చేయండి..
x
Highlights

ఈ ఆధునిక కాలంలో జుట్టు రాలె సమస్య ప్రతి వందమందిలో 80 మందికి ఉంటుంది. జుట్టు రాలడానికి ముఖ్య కారణాల్లో ఒకటి చుండ్రు సమస్య.. ఈ చుండ్రు సమస్య ప్రతి...

ఈ ఆధునిక కాలంలో జుట్టు రాలె సమస్య ప్రతి వందమందిలో 80 మందికి ఉంటుంది. జుట్టు రాలడానికి ముఖ్య కారణాల్లో ఒకటి చుండ్రు సమస్య.. ఈ చుండ్రు సమస్య
ప్రతి పదిమందిలో నలుగురికి నిరంతరం ఉంటుంది. అది ఏం చేసినా, ఎన్ని షాంపూలు వాడినా పోదు.. అయితే దీనికి నిపుణులు చెప్పే పరిష్కారం.. ప్రతిరోజు తల స్నానం చెయ్యడం. చుండ్రు ఎక్కువగా ఉండేవారు ప్రతిరోజు తలస్నానం చెయ్యడం వలన చుండ్రు తిరిగి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. అయితే ఇలా ప్రతిరోజు తల స్నానం చేస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అనే డౌట్ కూడా రావొచ్చు. మాములుగా ప్రతి మనిషికి రోజుకు 30 నుంచి 50 వెంట్రుకలు ఊడిపోతాయి. ఇది ఆరోగ్యవంతుని లక్షణం.

ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఊడిపోతున్నాయంటే మాత్రం.. జన్యుపరమైన లోపం, లేదా చుండ్రు, ఒత్తిడి లాంటి కారణాలు కావొచ్చు. వీటిలో జన్యుపరమైన లోపం ఉన్నవారికి జుట్టు ఎప్పుడూ రాలుతుంది. అది తలస్నానం రోజూ చేసినా.. చెయ్యకపోయినా జుట్టు మాత్రం రాలకుండా ఉండదు. మరోటి ఒత్తిడి.. ప్రతిమనిషికీ రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.. ఆలా ఉన్నప్పుడే ఒత్తిడి దూరమై జుట్టు కూడా రాలకుండా ఉంటుంది. ఇక మూడోది చుండ్రు.. ఇది కూడా కొందరికి జన్యుపరంగా వస్తుందని.. అంతేకాకుండా దుమ్ము ధూళి వలన కూడా వస్తుందని అంటుంటారు. అయితే ఇది నిరంతరం ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందువలన చుండ్రు ఉండేవారు ప్రతిరోజు తల స్నానం చేస్తే మంచిదే అంటున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories