చైనా ఆట క‌ట్టిస్తున్న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ యువ‌కుడు

x
Highlights

భారత భూభాగంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ... డోక్లామ్ వివాదం తర్వాత మరోసారి బరి తెగించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిమరీ బిషింగ్‌‌ దగ్గర రోడ్డు...

భారత భూభాగంపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ... డోక్లామ్ వివాదం తర్వాత మరోసారి బరి తెగించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిమరీ బిషింగ్‌‌ దగ్గర రోడ్డు నిర్మాణం చేపట్టింది. అసాధ్యమైన చోట రోడ్డు నిర్మాణం చేపట్టడం ఒక వింతయితే...ఈ దురాక్రమణను మన సైన్యం గుర్తించలేకపోవడం మరో విచిత్రం. ఇంతకీ అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ఎలా చేపట్టింది..? దానిని వెలుగులోకి తెచ్చిందెవరు...? చైనా దురాక్రమణకు గురైన బిషింగ్‌లో వాస్తవ పరిస్థితి ఏంటి అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

సంక్లిష్టమైన భౌగోళిక స్వరూపం..భూభాగానికి 4 వేల అడుగుల ఎత్తైన ప్రాంతం..నిట్టనిలువుగా ఉండే ప్రదేశం. ఇలాంటి చోట రోడ్డు నిర్మాణం చేయడం అసాధ్యం. కానీ చైన అసాధ్యమని అలా వదిలేయలేదు. భారత్ సరిహద్దులపై కాలుదువ్వుతున్న చైనా సైనికులు.. వాస్తవాధీన రేఖ దాటి వచ్చిమరీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. టిబెట్ నుంచి ప్రవహించే సియాంగ్ నదికి సమాంతరంగా కిలో మీటరుకు పైగా రోడ్డు వేశారు. చైనా చేసిన దుస్సాహసమే..ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బిషింగ్. అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్‌లోని ఓ కుగ్రామం. అప్పర్ సియాంగ్ జిల్లా ట్యూటింగ్‌ ఏరియాలో ఉన్న మారుమూల పల్లె. అసలు పల్లె అనడం కూడా కరెక్ట్ కాదేమో.. ఎందుకంటే...ఆ ఊరిలో ఉన్న ఇళ్ళు 16 మాత్రమే. ఆ ఊరి జనాభా 54 మందే. ఇంకా చెప్పాలంటే.. ఆ ఊరిలో పక్కా రోడ్డే లేదు. దీనికీ ఓ చిత్రమైన రీజన్ ఉంది. మారుమూల గ్రామాల్లో రోడ్లను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింది నిర్మిస్తారు. ఈ స్కీం నిబంధనల ప్రకారం కనీసం వంద మంది జనాభా ఉంటేనే...రోడ్డు నిర్మాణానికి అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనాభా సెంచరీ కూడా దాటకపోవడంతో రోడ్డు శాంక్షన్ కాలేదు. నిజానికి చైనా రోడ్డు వేసిన ప్రాంతం నుంచి బిషింగ్ గ్రామానికి కాలినడకన చేరాలంటే కనీసం 8 నుంచి 10 రోజులు పడుతుంది. అలాంటి గ్రామానికి 4 వేల అడుగుల ఎత్తైన ప్రాంతానికి చైనా సైనికులు గుట్టుగా బుల్ డోజర్లను ఎక్కించి రోడ్డు నిర్మాణం చేపట్టారు.

వాస్తవానికి మన భూభాగంలోకి వచ్చి చైనా సైన్యం రోడ్డు వేస్తున్న సంగతి సైనికులకు గమనించలేదు. ఈ దురాక్రమణను మొదటిసారి చూసింది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సరుకులు సరఫరా చేసే ఓ యువకుడు. అతను చైనా దురాక్రమణను చూసి హెచ్చరించిన తర్వాతే సైన్యం రంగంలోకి దిగి..రెడ్ ఆర్మీ ఆగడాన్ని అడ్డుకుంది. భారత్ ఆర్మీని చూసి వెనక్కి తగ్గిన చైనా చేసేది లేక బుల్ డోజర్లను రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించుకుపోయింది.

చైనా దురాక్రమణ తర్వాత ఇంతకాలం ప్రపంచానికి తెలియని బిషింగ్ గ్రామం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రెండు దేశాల సైనికులు విభేదాలు వీడి చేతులు కలిపాక బిషింగ్ గ్రామంలో ప్రశాంతత నెలకొంది. ప్రస్తుతం ఆ గ్రామం దగ్గర్లో ఉన్న సియాంగ్ నదికి ఇరు వైపులో రెండు దేశాల సైన్యాలు పహారా కాస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories