ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి..

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 09:46
how-to-check-your-name-in--voterlist

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల 
వేళా అందరికిప్పుడు ఒకటే డౌట్.. ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో అన్న అనుమానం. అయితే ఆ డౌట్ ను ఈ విధంగా క్లారిఫై చేసుకోవచ్చు.. అందుకోసం మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. 

1. sms ద్వారా.. మీ ఫోన్ నుంచి TS <SPACE> VOTE <SPACE> VOTERID NO ఎంటర్ చేసి 9223166166 నెంబర్ కు లేదా 51969 కు sms చెయ్యాలి Example:- TS VOTE ABC1234567 ఇలా అన్నమాట. ఇలా చేసిన కొంతసేపటికి మీకు రిప్లై sms వస్తుంది. మీ పేరు.. నియోజకవర్గం ఓటర్ లిస్టులో ఉందొ లేదో అప్పుడు తెలుస్తోంది. ఒకవేళ లేకపోతే నమోదు చేసుకునే సదుపాయం ఎలాగో ఆన్ లైన్ లో ఉంది. 

2. అంతేకాదు మనకున్న రెండో ఆప్షన్ మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోని ఇంటర్నెట్ బ్రౌజర్ లో http://ceotelangana.nic.in/ or http://ceoandhra.nic.in/  ను ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత కేటగిరీలోని search yuour name లో –> Assembly Constituency ని క్లిక్ చెయ్యాలి.

* అందులో జిల్లా పేరు, నియోజకవర్గం పేరును ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ తరువాత మీ పేరుతో కానీ ఓటర్ఐడి కార్డును కాని ఎంటర్ చేయాలి. ఆ తరువాత కింద ఉన్న క్యాప్చ ను కరెక్ట్ గా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ రాని పక్షంలో మీ పేరు ఓటర్ లిస్టులో లేదని గుర్తించి వెంటనే నమోదు చేసుకోవాలి.  

ఇలా రెండు పద్ధతులు పాటించి ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవచ్చు.

English Title
how-to-check-your-name-in--voterlist

MORE FROM AUTHOR

RELATED ARTICLES