logo

hmtv చేతిలో గజల్ శ్రీనివాస్ రాసలీలలు

గజల్ శ్రీనివాస్‌ లైంగిక ఆరోపణలు కేసులో సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పోలీసులకు అందించిన సాక్ష్యాలను hmtv exclusive గా సంసాదించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కేవలం hmtv దగ్గర మాత్రమే ఉంది. గజల్ శ్రీనివాస్‌‌పై ఫిర్యాదు చేసిన బాదితురాలు సమర్పించిన ఆధారాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు.

బాధితురాలు కుమారి గజల్ శ్రీనివాస్‌‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి పక్కా సాక్ష్యాలను పోలీసులకు అందజేసింది. ఆలయవాణి వెబ్ ఛానల్ లో పని చేసే ఉద్యోగితో గజల్‌ శ్రీనివాస్‌ మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసింది. గజల్ ఆఫీస్‌లో బెడ్‌రూం ఏర్పాటు చేసుకున్నారంటూ దీనికి సంబంధించిన ఆధారాలను కుమారి పోలీసులకు ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గజల్ శ్రీనివాస్‌పై కేసుకు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన పీఏ పార్వతి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. గజల్ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో పార్వతిని ఏ-2గా చేర్చారు.

లైవ్ టీవి

Share it
Top