హైదరాబాద్‌లో 'సెక్స్‌ డ్రగ్‌' కలకలం.. లైంగిక హార్మోన్లు పెరిగేలా

హైదరాబాద్‌లో సెక్స్‌ డ్రగ్‌ కలకలం.. లైంగిక హార్మోన్లు పెరిగేలా
x
Highlights

హైదరాబాద్ నగర శివార్లలోని నాచారంలో సెక్స్ డ్రగ్స్ కలకలం రేపుతోంది. దీంతో డ్రగ్ కంట్రోల్‌ బోర్డు అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ నాచారం...

హైదరాబాద్ నగర శివార్లలోని నాచారంలో సెక్స్ డ్రగ్స్ కలకలం రేపుతోంది. దీంతో డ్రగ్ కంట్రోల్‌ బోర్డు అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ నాచారం పరిధిలోని ఈ ల్యాబ్‌ను సీజ్‌ చేశారు. అక్కడ తయారయ్యే మత్తు పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలోకి వెళతారని వారు చెబుతున్నారు. ఇది మనిషిలోని హైదరాబాద్‌లో 'సెక్స్‌ డ్రగ్‌' కలకలం.. లైంగిక హార్మోన్లు పెరిగేలా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఐదేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు నిగ్గుతేల్చారు. సైకోటోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ కేటగిరీలోకి వచ్చే ఈ డ్రగ్ ను కొన్ని రసాయనాలను వినియోగించి తయారు చేస్తారు. మూసి ఉన్న గదిలో ఇలాంటి యంత్రాన్ని ఉంచి, రసాయనాలను ప్రాసెసింగ్‌ చేసి కేటమైన్‌ తయారు చేయడం రిస్క్‌తో కూడుకున్న విషయం. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ విస్పోటనం జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. జనావాసాల మధ్య ఇలాంటివి ఉండటం మరియు గుర్తించడం దేశంలోనే ఇది ప్రధమనని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories