అమరజవాను ఔరంగజేబు కుటుంబానికి గొప్ప చరిత్ర...కుటుంబంలో ఉన్న మగాళ్లంతా ఆర్మీలో మొనగాళ్లే

Submitted by arun on Tue, 06/19/2018 - 11:24

నాన్న మిలిటరీ ఆఫీసర్.. బాబాయ్ మిలిటరీ ఆఫీసర్.. అన్నయ్య కూడా ఆర్మీలోనే పనిచేస్తూ.. దేశ సేవ చేస్తున్నాడు. ఇంకో ఇద్దరు తమ్ముళ్లు కూడా ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఇదీ.. ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీర్ జవాను ఔరంగజేబు ఫ్యామిలీ. కశ్మీర్ మాత్రమే కాదు.. దేశం గర్వించదగ్గ కుటుంబం వాళ్లది. కశ్మీర్ అమరజవాను ఔరంగజేబు కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ముందునుంచే వాళ్ల ఫ్యామిలీకి.. దేశం అంటే అమితమైన ప్రేమ. దేశానికి సేవ చేయడానికే తామంతా పుట్టామని భావించే కుటుంబం. అందుకే.. ఆ కుటుంబంలో పుట్టిన మగాళ్లకి ఆర్మీ అంటే ఎంతో ప్రేమ.

అమరజవాను ఔరంగజేబు నాన్న హనీఫ్.. ఎంతోకాలం ఆర్మీలో పనిచేశారు. దేశానికి తనవంతు సేవ చేసి.. రిటైర్ అయ్యారు. ఔరంగజేబు వాళ్ల బాబాయ్ కూడా.. ఆర్మీలోనే చేరారు. దేశ సేవకు అంకితమయ్యారు. 2004లో.. ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న క్రమంలో ఆయన వీరమరణం పొందారు. వీళ్లే కాదు.. ఔరంగజేబు అన్నయ్య మహ్మద్ ఖాసిం కూడా ఆర్మీ జవానే. వీళ్లందరి స్ఫూర్తితో.. ఔరంగజేబు కూడా సైనికుడయ్యాడు. ఎంతోమంది ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో తన వంతుగా.. తన తుపాకి నుంచి బుల్లెట్లను కూడా దింపాడు. ఔరంగజేబు కేవలం జవాను మాత్రమే కాదు.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. 

బాబాయ్ ఆర్మీలో ఉన్నప్పుడే.. వీరమరణం పొందాడు. అన్న ఔరంగజేబు కూడా.. ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. ఐనా.. ఔరంగజేబు ఇద్దరు తమ్ముళ్లు.. ఇప్పుడు దేశ సేవ కోసం ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చాలు.. ఆ కుటుంబానికి దేశం మీద ఉన్న ప్రేమేంటో చెప్పడానికి. ఇది చాలు.. వాళ్లకు చావు అంటే భయం లేదని చెప్పడానికి. నాన్న, బాబాయ్, అన్న, తమ్ముడు.. ఇలా కుటుంబంలో ఉన్న మగాళ్లంతా.. ఆర్మీలో మొనగాళ్లే. దేశం మీద వాళ్లకున్న భక్తే.. వాళ్లేంటో చెప్తోంది. నిజంగా.. అమరజవాను ఔరంగజేబు లాంటి ఫ్యామిలీ ఉండటం.. దేశం గర్వించదగ్గ విషయం.

English Title
History Of Aurangzeb's Family in Jammu and Kashmir

MORE FROM AUTHOR

RELATED ARTICLES