కుమారస్వామి ప్రమాణాన్ని ఆపండి.. సుప్రీంకోర్టులో పిటిషన్..

కుమారస్వామి ప్రమాణాన్ని ఆపండి.. సుప్రీంకోర్టులో పిటిషన్..
x
Highlights

జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పీఠం కట్టబెట్టడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హిందూ మహా సభకు ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి...

జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం పీఠం కట్టబెట్టడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన హిందూ మహా సభకు ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నియామకం, ప్రమాణ స్వీకారంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీం తిరస్కరించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానం పంపడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ హిందూ మహాసభ తన పిటిషన్‌లో పేర్కొంది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండ్రోజులకే బీజేపీ నేత బిఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బలపరీక్షలో నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఈ నెల 19న ఆయన సీఎం పదవి నుంచి వైదొలిగారు. దీంతో అదే రోజు కుమారస్వామికి గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ మద్దతులో కుమారస్వామి రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories