శబరిమలపై సుప్రీం తీర్పును నిరసిస్తూ భారీ ర్యాలీ

శబరిమలపై సుప్రీం తీర్పును నిరసిస్తూ భారీ ర్యాలీ
x
Highlights

కొందరు మహిళలు ఎన్నాళ్లో వేచిన సమయం శబరిమల ఆలయ ప్రవేశం. ఆ తీర్పు రానే వచ్చింది. అయితే ఇప్పుడా తీర్పుపై జరగాల్సిన చర్చ జరుగుతుంది. సుప్రీం తీర్పును...

కొందరు మహిళలు ఎన్నాళ్లో వేచిన సమయం శబరిమల ఆలయ ప్రవేశం. ఆ తీర్పు రానే వచ్చింది. అయితే ఇప్పుడా తీర్పుపై జరగాల్సిన చర్చ జరుగుతుంది. సుప్రీం తీర్పును స్వాగతించిన వారు కొందరైతే వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. కేరళలో చట్టానికి వ్యతిరేకంగా, సాంప్రదాయమే పాటిస్తామంటూ కొందరు మహిళలు సేవ్‌ శబరిమల పేరుతో నిరసనలు చేపట్టారు.

సుప్రీం కోర్టు శబరిమల ఆయల తాజా తీర్పుపై హిందూ మహిళా సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అన్నీ వయసుల మహిళలు ఆలయంలోని వెళ్గొచ్చని తీర్పునివ్వగా ఈ తీర్పును మహిళా సంఘాలు స్వాగతిస్తే, హిందూ మహిళా సంఘం మాత్రం తాము ఆలయంలోకి వెళ్లమని చేప్తోంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంత మద్దతు లభిస్తుండగా, వ్యతిరేకత కూడా లభిస్తోంది. ఈ క్రమంలో కొందరు కేరళ రాష్ట్ర హిందూ మహిళా సంఘం తీవ్రంగా వ్యక్తిరేకిస్తోంది. దీంతో రాష్ట్రప్రభుత్వ తీరును నిరసిస్తూ, లక్షలాది మహిళలు రోడ్డుపై నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ నినాదాలు చేశారు. ‘తాము శబరిమలకు వేళ్లేది లేదని, తాము చిన్నతనంలో స్వామిని దర్శించుకున్నామని చెప్తున్నారు. తిరిగి ఎప్పుడు దర్శించుకోవాలో తమకు తెలుసని, ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే తాము అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే... శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలో మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. శబరిమల తీర్పుపై కేరళ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయదని, ఆలయాన్ని సందర్శించే మహిళా భక్తుల భద్రతకు, సౌకర్యాలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ఓవైపు హిందూ ప్రజా సంఘాలు, హిందూ మహిళా సంఘాలు కేరళ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే.. కేరళ ప్రభుత్వం మాత్రం... సుప్రీం తీర్పుకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చెసేది లేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి ముంచెత్తింది.

 సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఎన్ఎస్ఎస్ మెడికల్ జంక్షన్ నుంచి వలియాకోయిక్కల్ వరకు నిరసన యాత్ర చేపట్టారు.

 సెప్టెంబర్ 27న శబరిమలపై ఇచ్చిన తీర్పును సుప్రీం మరోసారి రివ్యూ చేయాల్సిందేనని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories