హెలికాఫ్టర్ టాక్సీలు

హెలికాఫ్టర్ టాక్సీలు
x
Highlights

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయానికుల సౌకర్యార్ధం హెలికాఫ్టర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ జబ్బర్ హట్టి విమానాశ్రయం...

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయానికుల సౌకర్యార్ధం హెలికాఫ్టర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ జబ్బర్ హట్టి విమానాశ్రయం వద్ద ఈ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ హెలీ టాక్సీల ద్వారా షిమ్లా నుంచి చండీఘర్ వరకు గల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ సేవలు విజయవంతం అయిన తర్వాత రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. పవన్ హన్స్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో హిమాచల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెలీ టాక్సీ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులోకి ఉంటాయి. 20 నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రయాణానికి 2999 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు విమానాల్లో ప్రయాణించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ ఉడాన్ స్కీమ్‌ను ప్రారంభించారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్ గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories