పార్టీని వీడే ఆలోచనలో ఇద్దరు టీడీపీ నేతలు

పార్టీని వీడే ఆలోచనలో ఇద్దరు టీడీపీ నేతలు
x
Highlights

నంద్యాలలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఉప ఎన్నికల తర్వాత నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు ముదిరాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య...

నంద్యాలలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఉప ఎన్నికల తర్వాత నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు ముదిరాయి. టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. నంద్యాల ఎంపీ టిక్కెట్‌పై ఎలాంటి హామీ లేకపోవడంతో ఎస్పీవై రెడ్డి కూడా టీడీపీని గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎంపీ టిక్కెట్ తమకేనంటూ మాండ్ర శివారెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తుండడంతో ఎస్పీవై రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలాగే టీడీపీని వీడే క్రమంలో నంద్యాల ఎంపీ టిక్కెట్‌ను ఆశిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీనీ వీడతారని సమాచారం. మొత్తానికి కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగించేందుకు ముహూర్తం ఖారారైంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్‌లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. దీంతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories