తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు

Submitted by arun on Tue, 08/14/2018 - 16:07

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే, అసెంబ్లీ, లా సెక్రటరీలు సెప్టెంబర్‌ 17న విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల గన్‌మెన్ల ఉపసంహరణపైనా హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంలో తెలంగాణ డీజీపీతో పాటు, జోగులాంబ ఎస్పీ, నల్గొండ ఎస్పీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలని అసెంబ్లీ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. 

English Title
High Court Notice to TS Assembly Speaker

MORE FROM AUTHOR

RELATED ARTICLES