జనసేనలోకి నాగబాబు.. పోటీ ఇక్కడి నుంచే

జనసేనలోకి నాగబాబు.. పోటీ ఇక్కడి నుంచే
x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు జనసేనలో చేరారు. పార్టీ అధినేత పవన్, జనసేన కండువా కప్పి నాగబాబును పార్టీలోకి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు జనసేనలో చేరారు. పార్టీ అధినేత పవన్, జనసేన కండువా కప్పి నాగబాబును పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన లోక్ సభ అభ్యర్థిగా నర్సాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి నుంచి జనసేనకు నాగబాబు పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు కానీ ప్రత్యేక్షంగా మాత్రం ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కాగా ఎన్నికల వేళ జనసేనలోకి అడుగు పెడతాడని జోరుగా ప్రచారం సాగింది. మొత్తానికి అనుకున్నట్లుగానే ఎన్నికల సమయంలో నాగబాబు పార్టీలో చేరి​ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories