ఐఏఎస్‌ బదిలీల్లో పలువురికి కొత్తగా కీలక పోస్టులు

ఐఏఎస్‌ బదిలీల్లో పలువురికి కొత్తగా కీలక పోస్టులు
x
Highlights

ఐఏఎస్‌ బదిలీల్లో పలువురికి కొత్తగా కీలక పోస్టులు దక్కాయి. సమర్థులకు జగన్ ప్రభుత్వం కీలక శాఖలు కేటాయించింది. డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి అదనపు...

ఐఏఎస్‌ బదిలీల్లో పలువురికి కొత్తగా కీలక పోస్టులు దక్కాయి. సమర్థులకు జగన్ ప్రభుత్వం కీలక శాఖలు కేటాయించింది. డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ సీఎం జగన్ ముఖ్య సలహాదారునిగా మాజీ సీఎస్ అజేయకల్లంను నియమించారు. 13 జిల్లాలకుగాను 9 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు.

ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనదైన ముద్ర చూపింది. జగన్ ముఖ్య సలహాదారునిగా మాజీ సీఎస్ అజేయకల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అజేయకల్లంకు కేబినేట్ హోదా కల్పించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అజేయకల్లం పేషికి పది మంది సిబ్బందిని కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులతో పాటు ప్రభుత్వ సలహాదారులందరికీ అజేయ కల్లం నాయకత్వం వహించనున్నారు. అలాగే డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఇక కొత్తగా కీలక పోస్ట్‌లు పొందిన వారిలో ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్,అట‌వీ శాఖ‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. అలాగే వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య,బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్,పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ,వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి,గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము, మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న,హర్టీకల్చర్, సెరీకల్చర్ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి నియమితులైయారు.

అలాగే ఎక్సైజ్ కమిషనర్‌గా ఎంఎం నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా హర్షవర్ధన్,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, సీఎం ఓఎస్డీగా జే.మురళీ,సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్,ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా కృష్ణబాబు, స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దమయంతి, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు, ట్రాన్స్‌కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్,ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా, జెన్కో ఎండీగా బి.శ్రీధర్, సివిల్ సప్లయిస్ కమిషనరుగా కోన శశిధర్‌ను నియమించారు.

హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా కేఆర్ఎం కిషోర్ కుమార్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఐపియ‌స్ అధికారి క‌సిరెడ్డి వీఆర్‌య‌న్ రెడ్డి,వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్, ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే,మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్ , సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం,శాప్ ఎండీగా కాటంనేని భాస్క‌ర్‌ను నియమించారు.

13 జిల్లాలకుగాను 9 మంది కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రకాశం కలెక్టర్ వినయ్ చంద్‌ను విశాఖ కలెక్టర్‌గా నియమించింది. నెల్లూరు కలెక్టర్‌గా ఎంవీ శేషగిరిరావు , పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ముత్యాలరాజు,కర్నూలు కలెక్టర్‌గా జి.వీరపాండ్యన్, చిత్తూరు కలెక్టర్‌గా నారాయణ భగత్ గుప్తా,గుంటూరు కలెక్టర్‌గా శ్యామ్యూల్ ఆనంద్, తూర్పు గోదావరి కలెక్టర్ గా మురళీధర్ రెడ్డి,అనంతపురం కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ, ప్రకాశం కలెక్టర్‌గా పి.భాస్కర్ ను నియమించింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లను ప్రస్తుతానికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories