జర్నీ హీరోయిన్ ఇల్లు మునక

Submitted by arun on Mon, 08/20/2018 - 16:01
Ananya

ప్రకృతి.. జనం మధ్య తేడాలు చూపదు. ధనిక, పేద, హీరో, సామాన్యుడు అనే తేడాలేం వుండవు. అఆ, జర్నీ తదితర చిత్రాల్లో నటించి తెలుగువారికి కూడా చేరువైన నటి అనన్య కష్టాల్లో ఉంది. కేరళ వరదల్లో ఆమె ఇల్లు కూడా మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలైన సహనటి ఆశా శరత్ ఇంట్లో తలదాచుకుంటోంది. `మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే నీటిమ‌ట్టం పెరిగిపోతోంది. ఇప్ప‌టికీ వ‌ర్షం కురుస్తోంది. మా స‌న్నిహితులు, బంధువుల ఇళ్లు కూడా మునిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు మా ఇంట్లో ఉండ‌గ‌లిగాం. ఇప్పుడు న‌టి ఆశా శ‌ర‌త్ ఇంట్లో త‌ల దాచుకుంటున్నాం. జీవితంలో ఎన్న‌డూ లేని విధంగా గ‌త రెండ్రోజులుగా చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన పరిస్థితుల‌ను ఎదుర్కొన్నాను. మాకు స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తున్న‌వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా అనన్య వెల్ల‌డించింది.

English Title
heroine Ananya house goes underwater

MORE FROM AUTHOR

RELATED ARTICLES