హీరో విక్రమ్‌ ఇంట విషాదం

Submitted by arun on Mon, 01/01/2018 - 14:52
 Vikram

ప్రముఖ నటుడు విక్రమ్‌ ఇంట విషాదం నెలకొంది. హీరో విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్‌రాజ్‌ వయసు 80 ఏళ్లు. విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ కూడా పలు క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌లో న‌టించి అభిమానుల ఆద‌రాభిమానం పొందారు. నృత్య రంగంలోను ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. అయితే ఆదివారం సాయంత్రం 4గం.ల‌కు విక్ర‌మ్ తండ్రి వినోద్ రాజ్ (80) అనారోగ్యంతో క‌న్నుమూశారు. దీంతో విక్ర‌మ్ కుటుంబంలో విషాద‌ఛాయ‌లు నెల‌కొన్నాయి. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ వినోద్ రాజ్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ, కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేశారు. ఈ రోజు వినోద్ రాజ్ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.
actor vikram father passes away - Sakshi

English Title
hero vikram father passes away

MORE FROM AUTHOR

RELATED ARTICLES