క‌త్తి ప్ర‌శ్న‌ల‌కు పవన్ అభిమానుల స‌మాధానాలు!

క‌త్తి ప్ర‌శ్న‌ల‌కు పవన్ అభిమానుల స‌మాధానాలు!
x
Highlights

నటి పూనం కౌర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ, రెండు రోజుల క్రితం సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ కొన్ని ప్రశ్నలను సంధించిన తరువాత, వాటికి...

నటి పూనం కౌర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ, రెండు రోజుల క్రితం సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ కొన్ని ప్రశ్నలను సంధించిన తరువాత, వాటికి సమాధానాలను పవన్ ఫ్యాన్స్ ప్రిపేర్ చేశారు. కత్తి ప్రశ్నలకు సమాధానాలను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ సమాధానాల్లో ఉన్న వివరాల ప్రకారం, ‘‘ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట‌గా పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారు. ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొంది. అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ ప‌క్క‌న పూన‌మ్ సెట్ అవ‌ద‌ని భావించి క‌మ‌లినీని తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. సినీ పరిశ్ర‌మ‌లో ఇలాంటివి సాధార‌ణ‌మే. కానీ, కెరీర్ ఇబ్బందుల్లో ప‌డిపోయిందనే ఉద్దేశంతో పూన‌మ్ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీనికి తాను కూడా ఎంతో కొంత కార‌ణం అని భావించిన ప‌వ‌న్ ఆమెను ఆస్పత్రికి వెళ్లి ప‌రామ‌ర్శించి బిల్లు క‌ట్టారు. పూన‌మ్ కెరీర్‌లో స్థిర‌ప‌డ‌డానికి త‌న వంతుగా స‌హాయం చేస్తానని పూన‌మ్ త‌ల్లికి మాటిచ్చారు. ఆ త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎవ‌రిని పెట్టాలని ఆలోచిస్తున్న‌ప్పుడు పూన‌మ్ పేరును ప‌వ‌న్ సూచించారు. ఇందులో ప‌వ‌న్ చేసిన త‌ప్పేమీ లేదు’’ అని అభిమానులు ఓ మెసేజ్‌ను స‌ర్క్యులేట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories