తల లేక 'పోయిన' బతికేస్తున్న కోడి

తల లేక పోయిన బతికేస్తున్న కోడి
x
Highlights

తల లేకుండా భూమి మీద ఏదైనా జీవి బతకగలుగుతుందా ? అంటే ... నేల మీద కాదు కదా నింగిలో కూడా సాధ్యం కాదంటారు కదూ .. ? అయితే మీ నిర్ణయం మార్చుకోవాల్సిందే....

తల లేకుండా భూమి మీద ఏదైనా జీవి బతకగలుగుతుందా ? అంటే ... నేల మీద కాదు కదా నింగిలో కూడా సాధ్యం కాదంటారు కదూ .. ? అయితే మీ నిర్ణయం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే థాయ్‌లాండ్‌లో ఓ కోడి వారం నుంచి తల లేకుండానే జీవిస్తోంది. స్ధానికంగా ఉన్న పశువైద్యురాలు ఈ కోడిని సంరక్షిస్తున్నారు. మెడ కింది నుంచి గొంతులోకి ఆహారం అందిస్తూ కోడి ప్రాణాన్ని నిలబెడుతున్నారు. ‘తల లేక పోయినా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను ఈ కోడి గుర్తించ కలుగుతోంది. అడుగుల శబ్ధం విన్న వెంటనే రెక్కలు విదిలించి గాలిలోకి ఎగురుతోంది. అయితే కోడి తల ఎలా తెగిపోయిందో తెలియదని కోడిని సంరక్షిస్తున్న పశు వైద్యురాలు చెబుతున్నారు. గతంలో ఓ కోడి తల లేకుండా 18 నెలలు జీవించిన ఘటన అమెరికాలో జరిగింది .

Show Full Article
Print Article
Next Story
More Stories