ఇంటర్‌ ప్రశ్న పత్రాలు గల్లంతు

ఇంటర్‌ ప్రశ్న పత్రాలు గల్లంతు
x
Highlights

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ఫలితాల విషయంలో తీవ్ర అవకతవకలతో అబాసుపాలైన బోర్డు తాజాగా అడ్వాన్స్‌డ్‌...

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ఫలితాల విషయంలో తీవ్ర అవకతవకలతో అబాసుపాలైన బోర్డు తాజాగా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల విషయంలోనూ అదే నిర్లక్ష్యం వహించింది. వరంగల్‌ లోని మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు ఇటీవలే సప్లిమెంటరీ ప్రశ్నాపత్రాలు వచ్చాయి. అయితే అందులో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన రెండు బాక్సులు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ఇంటర్‌బోర్డు కస్టోడియన్‌ రెండు రోజుల క్రితం వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాల సీల్డ్‌బాక్సులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రెండు బాక్సులు గల్లంతైనట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెండు రోజులుగా ఇంటర్‌ బోర్డు అధికారులు, పోలీసులు బాక్సుల కోసం రహస్యంగా గాలిస్తున్నారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాల గల్లంతుపైనా రహస్య విచారణ చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌ను జల్లెడ పట్టడమే కాకుండా పీఎస్‌కు ప్రశ్నపత్రాల బాక్సులను తరలించడానికి ముందు వాటిని భద్రపరిచిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయంలో, శంభునిపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా వాటి జాడ దొరక్కపోవడంతో పోలీసులు, ఇంటర్‌ అధికారులు హైరానా పడుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ అడ్వాన్స్‌డ్‌ సంప్లమెంటరీ పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో ప్రశ్నాపత్రాల బాక్సులు మిస్‌ కావడంతో అటు పోలీసులు ఇటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories