అదరగొట్టిన బౌలర్లు.. ఐదో వన్డేలో భారత్ ఘన విజయం

అదరగొట్టిన బౌలర్లు.. ఐదో వన్డేలో భారత్ ఘన విజయం
x
Highlights

న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను టీమిండియా ఘనంగా ముగించింది ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న భారత్ గత మ్యాచ్ లో ఓడి కాస్త డీలా పడింది అయితే తిరిగి ఈరోజు...

న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను టీమిండియా ఘనంగా ముగించింది ఇప్పటికే సిరీస్ ను గెలుచుకున్న భారత్ గత మ్యాచ్ లో ఓడి కాస్త డీలా పడింది అయితే తిరిగి ఈరోజు వెల్లింగ్టన్ లో జరిగిన చివరి వన్డేలో గెలిచి సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది దీంతో 35 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

చివరి వన్డేలో కూడా నాల్గో వన్డే మాదిరిగానే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ విఫలమయ్యారు మరోవైపు కొత్త కుర్రాడు శుభ్‌మన్‌ గిల్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఆదుకుంటాడనుకున్న ధోనీ కూడా ఫెవీలియన్ కు చేరడంతో 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత జట్టు 50 పరుగులు చేయడం కూడా కష్టమని అందరూ భావించారు. కానీ మిడిలార్డర్‌లో సీన్‌ రివర్స్‌ అయింది. అంబటి రాయుడు 90 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు అతడికి శంకర్ అండగా నిలబడ్డాడు ఇక చివర్లో హార్దిక్ పాండ్యా బ్యాటు జులిపించడంతో టీమిండియా 252 పరుగులు చేసింది.

అనంతరం బౌలింగ్ లో టీమిండియా బౌలర్లు రాణించారు క్రమంగా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ ను ఫెవీలియన్ బాట పట్టించారు. భారత బౌలర్లలో చాహల్ 3, పాండ్యా, షమీలు రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్, యాదవ్ లు తలో వికెట్ పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories