వానతో కళకళలాడుతున్న తెలంగాణ..

వానతో కళకళలాడుతున్న తెలంగాణ..
x
Highlights

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో తెలంగాణ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడుతోంది. జూన్‌లో...

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం తోడవడంతో తెలంగాణ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడుతోంది. జూన్‌లో తొలకరితో మురిపించి మాయమైన వరుణుడు ప్రతాపం చూపిస్తుండటంతో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్‌లు నిండుకుండలా మారుతున్నాయి. చెరువులు, కుంటల్లోని నీరు చేరుతోంది. భారీ వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లా కొత్త సోయగాలు అద్దుకుంది. నిన్నటివరకు నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతాలు జలధారలతో ఆకట్టుకుంటున్నాయి. కుంటాల, పొచ్చర.. బొగత జలపాతం పరవళ్లు తొక్కుతున్నాయి. వాటర్‌ఫాల్స్‌ అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాన జల్లుమంటోంది జిల్లాలోని ఏటూరునాగారం, ములుగు, వాజేడుల్లో వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాల్లోనూ వరుణుడి కరుణతో జలకళ కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. శ్రీరాం ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రభావంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories