నారావారిపల్లిలో చంద్రబాబు, కుటుంబ సభ్యుల సందడి

naravaripalli
x
naravaripalli
Highlights

సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సొంతూర్లో సంక్రాంతి జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ని, సెక్యూరిటీని పక్కనపెట్టారు. నాగాలమ్మ గుడికి ముందుగా నిర్ణయించిన రూట్లో కాకుండా చిన్నప్పుడు వెళ్లిన మట్టి రోడ్డుపై సీఎం నడుచుకుంటూ వెళ్లారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో పూజల అనంతరం సీఎం... తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అలాగే, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories