మరో మూడు నెలల్లో దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి!

Submitted by arun on Wed, 03/07/2018 - 11:37
Deepika padukone Ranveer singh

సినీ నటులు దీపికాపదుకునే.. రణ్‌వీర్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారా అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రాబోయే మూడు నాలుగు నెలలో వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానుందన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. తాజాగా రెండు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం. గతవారమే దీపిక తల్లిదండ్రులు ప్రకాశ్, ఉజ్జల పదుకునే బెంగళూరు నుంచి ముంబై వెళ్లి రణ్‌వీర్ తల్లిదండ్రులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది.
 
పెళ్లి ఎక్కడ జరగాలన్నదానిపై దీపిక, రణ్‌వీర్ జంట ఒకటనుకుంటే వాళ్ల తల్లిదండ్రులు మాత్రం వేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కొత్తజంట విరుష్కలలాగా విదేశాల్లో జరుపుకుందామని దీప్‌వీర్ అనుకుంటుండగా.. రణ్‌వీర్ తల్లిదండ్రులు  ముంబైలోనే జరగాలని గట్టిగా పట్టుబడుతున్నారట. ఎందుకంటే ఇద్దరి తరఫు బంధువులు అక్కడే ఎక్కువగా ఉండటంతో అక్కడే చేయాలని నిశ్చయించారట. దక్షిణాది సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేయనున్నట్టు సమాచారం.

English Title
Have Ranveer Singh and Deepika Padukone's parents finalised their wedding date?

MORE FROM AUTHOR

RELATED ARTICLES