హత్యలో శిఖా చౌదరి ప్రమేయంపై కూపీ లాగుతున్న పోలీసులు

హత్యలో శిఖా చౌదరి ప్రమేయంపై కూపీ లాగుతున్న పోలీసులు
x
Highlights

నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. జయరాంను చంపింది ఆయన మేనకోడలు శిఖా చౌదరి...

నాలుగురోజుల క్రితం జరిగిన కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. జయరాంను చంపింది ఆయన మేనకోడలు శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అయిన రాకేష్‌రెడ్డి అని తేల్చారు. రాకేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు హైదరాబాద్‌ నుంచి నందిగామకు తరలించారు. డబ్బు కోసమే జయరాంను రాకేశ్‌ హత్య చేసినట్లు తేలింది. హైదరాబాద్‌లోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కారులో నందిగామ వైపు తీసుకెళ్లి ప్రమాదంలో మృతి చెందినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

జయరాం మేనకోడలు శిఖా చౌదరికి రాకేశ్‌ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాఖేష్ దగ్గర జయరాం నాలుగున్నర కోట్ల అప్పు తీసుకున్నాడు. డబ్బు ఇవ్వకపోవడంతో వారి మధ్వ విభేదాలు తలెత్తాయి. దాంతో జయరాంపై కక్ష పెంచుకున్న రాకేష్ రెడ్డి హత్యకు పాల్పడ్డాడు. జయరాం, రాకేష్‌ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే హత్య జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ హత్యలో జయరాం మేనకోడలు శిఖా చౌదరి ప్రమేయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ దగ్గరలో శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నస్తున్నారు.

నాలుగున్నర కోట్ల అప్పు వ్యవహారంలో జయరాంను చంపాలనుకున్న రాకేష్‌ రెడ్డి హత్యకు కుక్కలను చంపడానికి వాడే ఇంజెక్షన్‌ను ఉపయోగించాడు. జయరామ్ కు ఇంజెక్షన్‌ చేయడంతో 10 నిమిషాల్లోనే జయరాం శరీరం విషపూరితమైనట్లు సమాచారం. అలాగే జయరాం తలపై బీరు బాటిల్‌తో కొట్టినట్టు తెలుస్తోంది. మృతదేహం గుర్తించడానికి 24 గంటల ముందే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. అలాగే జయరాం రాకేష్ రాకేష్‌కు సహకరించిన వారు ఎవరనే విషయంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. రాకేష్‌, శిఖాచౌదరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

హత్య కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్న నందిగామ పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో శిఖా చౌదరి సంచలన విషయాలు వెల్లడించింది. మేనమామ జయరాంతో తనకు లైంగిక సంబంధం ఉన్నట్లు చెప్పింది. రెండు సార్లు విడాకులు తీసుకున్న తాను రాకేష్ రెడ్డితో డేటింగ్ చేసినట్లు అంగీకరించింది. నాలుగున్నర కోట్ల అప్పు విషయంలో తనకు రాకేష్‌కు మధ్య గొడవలు జరిగేవని వివరించింది. డబ్బు కోసం రాకేష్ హత్య చేస్తాడని భావించలేదని హత్యతో తనకేమీ సంబంధం లేదని చెప్పుకొస్తోంది. హత్య జరిగిన రోజు తన స్నేహితుడు శ్రీకాంత్‌ తో హైదరాబాద్ వెళ్ళాలని శిఖా చౌదరి చెబుతోంది.

జయరాం తన పేరుతో 10 ఏకరాల పొలం రాశాడని నందిగామ పోలీసులకు శిఖా చౌదరి చెప్పింది. మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదని అంటోంది. తననే కాకుండా తన చెల్లిని కూడా జయరాం లైంగికంగా వేధించాడని తెలిపింది. జయరాం‌కు చాలా అప్పులున్నాయనీ అయితే తన అత్తకు చెక్ పవర్ ఉండంతో అప్పులు తీర్చలేకపోయాడని వివరించింది. జయరాం మరణం తెలిసిన వెంటనే తాను ఆయన ఇంటికి వెళ్ళి ఆ పేపర్ల కోసం వెతికానే తప్ప తనకు హత్యకు ఎలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి చెబుతోంది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories