జిల్లా టాపర్‌కు షాక్ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు.. ఆ సబ్జెక్టులో సున్నా మార్కులు

జిల్లా టాపర్‌కు షాక్ ఇచ్చిన ఇంటర్ ఫలితాలు.. ఆ సబ్జెక్టులో సున్నా మార్కులు
x
Highlights

తాజాగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే కాగా విద్యార్థులకు భిన్నమైన ఫలితాలు రావడంతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు లీలలు ఒక్కొక‍్కటిగా...

తాజాగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే కాగా విద్యార్థులకు భిన్నమైన ఫలితాలు రావడంతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు లీలలు ఒక్కొక‍్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో మంచిర్యాల జిల్లా టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థినికి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో మాత్రం ఆమే దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. అయితే గతేఏడాది ఫస్టియర్ తెలుగులో ఆమెకు 98 మార్కులు వచ్చిన ఆమెకు ద్వితీయ సంవత్సరంలో మాత్రం సున్నా మార్కులు వచ్చాయి. ఫెయిల్‌ మెమో రావడంతో విద్యార్థినితో పాటు తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇక దీంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే ఇంటర్‌ బోర్డు నిర్వాకంతో నష్టపోయిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈసారి అనుభవం లేని వారితో పరీక్ష పేపర్లు దిద్దించారని ఆరోపించారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories