ఈసీ కొరఢా.. చిక్కుల్లో హరీశ్, ఉత్తమ్, రేవంత్

ఈసీ కొరఢా.. చిక్కుల్లో హరీశ్, ఉత్తమ్, రేవంత్
x
Highlights

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో...

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాక రేపుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఎన్నికల కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణలోని ఐదుగురు ప్రముఖ రాజకీయ నాయకులకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని అతిక్రమించడంతో ఈసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ చీఫ్ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ఈ మేరకు తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తోపాటు టీడీపీ నేతల రేవూరి ప్రకాష్ రెడ్డిలకు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురితోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఓ మతపరమైన మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు జారీ చేశామని ఉత్తం నుంచి వివరణ కోసం ఎదురుచూస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. టీఆర్ ఎస్ అభ్యర్థి కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థిని బెదిరించారని దానిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని తగిన చర్యలు తీసుకుంటామని రజత్ తెలిపారు.అయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారికి, గెలిచిన తర్వాత కూడా ఇబ్బందులు తప్పవని ఈసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories