ఆ రెండు కోరికలు...

Submitted by arun on Thu, 08/30/2018 - 11:54
Hari Krishna

ఇటు రాజకీయాలు.. అటు సినిమాలు. అన్నగారి తర్వాత ఆ రెండు రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి.. హరికృష్ణ. సినిమాల్లో క్యారెక్టర్లకు ప్రాణం పోయడంలోనూ.. తాను అలంకరించిన పదవులకు న్యాయం చేయడంలోనూ.. తనకు తానే సాటిగా నిలిచారు. అలాంటి హరికృష్ణకు సినీ రాజకీయ రంగాల్లో తీరని కోరికలు రెండు మిగిలిపోయాయి.  

ఆనాటి ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశానికి అన్నగా పెద్దదిక్కుగా ఉన్న హరికృష్ణ హఠాన్మరణం ఆ కుటుంబానికే కాకుండా యావత్‌ తెలుగువారిని విషాదంలో ముంచేసింది. జీవించినంత కాలం తండ్రి అడుగుజాడల్లో నడిచిన హరికృష్ణ ఎన్టీఆర్‌ తో పాటే ముఖానికి రంగేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో కూడా ఆయన వెంటే నడిచారు. కాలక్రమంలో ఎన్నో పదవులను అలంకరించారు. మధ్యలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్నారు. 2014 సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రాజీనామా చేసిన హరికృష్ణ.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 

అయితే హరికృష్ణకు కూడా రెండు తీరని కోరికలున్నాయని ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశాక రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమవ్వాలని భావించారట. రాష్ట్ర విభజన తర్వాత.. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు చాలా ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ చేయలేకపోయారని సమాచారం. దీంతో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టాలనే హరికృష్ణ కోరిక అలానే మిగిలిపోయింది. 

ఇక తండ్రిని అమితంగా ఇష్టపడే హరికృష్ణకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించాలని మనస్సులో ఉండేదట. సోదరుడు బాలకృష్ణ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో తానూ నటించాలని అనుకున్నారట. నిజ జీవితం ఎన్టీఆర్ చైతన్య రధం నడిపినట్లే సినిమాలోనే అదే పాత్ర పోషించాలని భావించారు. బాలయ్య ఎన్టీఆర్‌లా ఛైతన్య రథంపై కూర్చుంటే తానే రథసారధిగా ఉండే రియల్‌ లైఫ్‌ పాత్రను రీల్‌ లైఫ్‌లోనూ పోషించాలనుకున్నారు. తాన తండ్రిపై తీస్తున్న దృశ్యకావ్యంలో నటించి ఆ చారిత్రక సినిమాను వెండి తెరపై చూడాలని అనుకున్నారట. కానీ ఆ కోరిక కూడా హరికృష్ణకు తీరలేదు. 

English Title
Hari Krishna's political Journey

MORE FROM AUTHOR

RELATED ARTICLES