మరో హీరోయిన్‌తో హార్దిక్ డేటింగ్!

Submitted by arun on Thu, 06/07/2018 - 13:19
pandia

మరో క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతున్నదా? తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఓ బాలీవుడ్ నటితో డేటింగ్‌లో ఉన్నట్లు డీఎన్‌ఏఇండియా అనే వెబ్‌సైట్ ఓ కథనం రాసింది. కొన్నాళ్ల కిందట పాండ్యా.. స్వీడిష్-గ్రీక్ బ్యూటీ ఎల్లి ఎవ్రామ్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి తిరిగిన ఫొటోలూ బయటకు వచ్చాయి.

ఆమె హార్దిక్ అన్న కృనాల్ పెళ్లికి కూడా రావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ.. ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇదిలా ఉంటే, ఎల్లికి టాటా చెప్పిన హార్దిక్ వెంటనే మరో నటి ఇషా గుప్తాకు కనెక్ట్ అయిపోయాడట. ప్రస్తుతం ఇషా గుప్తాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ‘వాళ్లిద్దరూ ఒక పార్టీలో కలిశారు. ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకున్నారు. ఒకరి ఫోన్ నంబర్ ఒకరు తీసుకుని ఛాటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు మాకు తెలిసింది’ అని ఇషాకు దగ్గరగా ఉండే ఓ వ్యక్తి డీఎన్‌ఏ వెబ్‌సైట్‌కు వెల్లడించారు. 

English Title
hardik pandya dating with bollywood actress

MORE FROM AUTHOR

RELATED ARTICLES