logo

అరంగేట్రం టెస్టులోనే సత్తా చాటిన హనుమ విహారీ

అరంగేట్రం టెస్టులోనే సత్తా చాటిన హనుమ విహారీ

తెలుగుతేజం హనుమ విహారీ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ లోనే ఫైటింగ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటుకొన్నాడు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరిటెస్ట్ మూడోరోజు ఆటలో విహారి 124 బాల్స్ ఎదుర్కొని ఓ సిక్సర్, 7 బౌండ్రీలతో 56 పరుగుల స్కోరుకు ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. టెస్ట్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్ లోనే అర్థశతకం సాధించిన 26వ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. అంతేకాదు ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా నిలిచాడు. గతంలో
తొలిమ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాళ్లలో రూసీ మోడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఈ ముగ్గురి సరసన ఇప్పుడు హనుమ విహారీ వచ్చి చేరాడు.

లైవ్ టీవి

Share it
Top