రైతు సమస్యపై స్పందించిన కేసీఆర్. క్షణాల్లోనే..

రైతు సమస్యపై స్పందించిన కేసీఆర్. క్షణాల్లోనే..
x
Highlights

తన భూమిని మరొకరి పేరు మీదకు మార్చి తనను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ రైతు వ్యక్తం చేసిన ఆవేదనను సీఎం కేసీఆర్‌‌ అర్ధం చేసుకున్నారు. బాధిత...

తన భూమిని మరొకరి పేరు మీదకు మార్చి తనను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ రైతు వ్యక్తం చేసిన ఆవేదనను సీఎం కేసీఆర్‌‌ అర్ధం చేసుకున్నారు. బాధిత రైతుకు స్వయంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మంచిర్యాల జిల్లా నందుగులపల్లికి చెందిన శరత్ భూమిని మరొకరి పేరు మీద మార్చారు . దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కలెక్టర్ కార్యాలయం దగ్గర పడిగాపులు కాసిన పరిష్కారం కాకపోవడంతో సామాజిక మాధ్యామాల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ స్వయంగా శరత్‌తో మాట్లాడారు. తక్షణమే సమస్యను పరిష్కరిస్తానంటూ హామి ఇచ్చారు. మంచిర్యాల కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడిన కేసీఆర్ జరిగిన విషయాన్ని తెలియజేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .దీంతో నందుగుల పల్లి వెళ్లిన కలెక్టర్ రికార్డులను పరిశీలించడంతో స్ధానికులతో మాట్లాడారు. అనంతరం ఏడు ఎకరాల భూమిని శరత్ పేరు మీదకు పట్టా మార్చారు .

Show Full Article
Print Article
Next Story
More Stories