చేతులారా నాశనం చేసుకున్న కాంగ్రెస్..!

చేతులారా నాశనం చేసుకున్న కాంగ్రెస్..!
x
Highlights

నిన్న హిమాచల్ , గుజరాత్ లోని ఎన్నికల ఫలితాలు చూస్తే రెండు పార్టీలమధ్య అధికారం దోబూచులాడిందనే చెప్పాలి.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా...


నిన్న హిమాచల్ , గుజరాత్ లోని ఎన్నికల ఫలితాలు చూస్తే రెండు పార్టీలమధ్య అధికారం దోబూచులాడిందనే చెప్పాలి.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా నైతికంగా ఓటమి చెందిందని కొందరు రాజకీయ నేతలు అంటుంటే, కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా రాహుల్ స్వయంకృతాపరాధం వలెనే పార్టీ ఓటమి చెందిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.. హిమాచల్ రాజకీయాలు ఎలా ఉన్నా గుజరాత్ లో మాత్రం బీజేపీ కొంత ఎదురుగాలి వీచిందనే చెప్పాలి.. పార్టీకి మొదటినుంచి వెన్నుదోన్నుగా నిలుస్తూ వస్తున్న పటేళ్లు ఈసారి బీజేపీకి దూరంగా ఉన్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది..

పటేళ్ల ప్రభావం ఉన్నఏడూ జిల్లాలో బీజేపీ కనీసం ఖాతా తెరవలేదంటే ఆ పార్టీపై వారు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థంచేసుకోవచ్చు.. ఇటు క్రిస్టియన్ ల బలం ఎలాగో కాంగ్రెస్ కు ఉండగా, పార్టీని ముందుండి నడిపిస్తాననే ఆత్మవిశ్వాసంతో పగ్గాలు చేప్పట్టిన యువరాజు రాహుల్ గాంధీ గుజరాత్ లో సరిగా వ్యూహాలను అమలుచేయలేదని వాదన వినబడుతుంది.. ఎంత లేదనుకున్న మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన తరువాత ఏ పార్టీ అయినా కొంత విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.. అది సహజంగానే ప్రతిపక్షాలకి అనుకూలంగా వుంటుందనే భావన ఉంది.. కానీ ఇక్కడే కాంగ్రెస్ తన పుట్టి తానే ముంచుకుందన్న అభిప్రాయముంది. అధికారపార్టీ వ్యతిరేక ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చెయ్యలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.. ఇది కేవలం ఆ పార్టీకి ఉన్న నాయకత్వ సమస్యేనని కొందరంటుంటే, నాయకులమధ్య విభేదాలే కొంపముంచాయని మరికొందరంటున్నారు..

అంతేకాదు అధినేతలు ఇంకాస్త కస్టపడి ఉంటే దాదాపు 15 సీట్లలో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలు కచ్చితంగా గెలిచేవారని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ చేసుకున్న తప్పేనని ఆ పార్టీ నేతలే ఒప్పేసుకుంటున్నారు.. పార్టీ ఎలాగైనా గట్టెక్కుతుందన్న అతివిశ్వాసంతో ప్రచారం సరిగా చేయలేదనే అభిప్రాయం కూడా కాంగ్రెస్ కీలకనేతల్లో వ్యక్తమవుతుంది.. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రంకోసం రేయింబవళ్లు కస్టపడి గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల సహాయంతో పార్టీని విజయతీరాలకు చేర్చారు.. అలాంటిది రాహుల్ గాంధీకి గుజరాత్ లో అధికారం అంత అవసరం లేదనుకున్నారా..? అందరిని కలుపుని సమన్వయంతో ఎన్నికలకు వెళ్ళాల్సింది పోయి నిర్లక్షంగా ఉంటే చేతిదాకా వచ్చిన ముద్ద నోటిదాకా రాదనట్టు అధికారం కూడా అందినట్టే అంది అందకుండా పోయే ప్రమాదం ఉందనేది
గ్రహించకపోవడం గమనార్హం..

Show Full Article
Print Article
Next Story
More Stories