భార్యకు గడ్డం పెరుగుతోందని విడాకులు కోరిన భర్త...

Submitted by arun on Tue, 06/19/2018 - 13:23
Divorce

తన భార్యకు గడ్డం పెరుగుతోందని, గొంతు కూడా మగవారి మాదిరిగా ఉందని, పెళ్లి చూపుల్లో పరదా కట్టి కూర్చోబెట్టి చూడనివ్వలేదని ఆరోపిస్తూ, వివాహమైన తరువాత విడాకులకు దాఖలైన ఓ పిటిషన్ ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. కోర్టు పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు.

కానీ వివాహం అయిన అనంతరం తాను ఆమె మొహం చూసి ఆశ్చర్యపోయానని ఎందుకంటే ఆమెకు మగవారిలాగా గడ్డం ఉందన్నాడు. అంతేకాక ఆమె గొంతు కూడా మగవారి గొంతులాగానే ఉన్నదని తెలిపాడు. ఈ విషయాల గురించి తన భార్య కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు తనకు చెప్పకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నాడు.  దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, పిటిషన్ దారు భార్యను విచారించింది. తన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం మాట వాస్తవమని, కానీ అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని ఆమె తెలిపింది. తనపై భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆమె న్యాయమూర్తికి చెప్పగా, విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్ ను కొట్టివేశారు.

English Title
Gujarat Man Seeks Divorce Saying Wife Has Beard, Court Rejects Petition

MORE FROM AUTHOR

RELATED ARTICLES