జీఎస్టీతో తగ్గిన టూవీలర్స్ ధరలు

Highlights

జీఎస్టీలో 350సీసీ లోపు టూవీలర్స్ పై టాక్స్ ను 28% టాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గాయి. మోడల్ ను బట్టి వెయ్యి నుండి 3 వేల వరకు...

జీఎస్టీలో 350సీసీ లోపు టూవీలర్స్ పై టాక్స్ ను 28% టాక్స్ పరిధిలోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గాయి. మోడల్ ను బట్టి వెయ్యి నుండి 3 వేల వరకు ధరలు తగ్గాయి. అయితే కొన్ని మోడళ్లపై ఇంకా క్లారిటీ రావాల్సి వుందని షోరూం యజమానులు చెబుతున్నారు.

దేశంలో టూవీలర్ ధరలు తగ్గాయి. ఇప్పటి వరకు టూ వీలర్స్ పై టాక్స్ 31 శాతం పైనే వుంది. కాని జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ టాక్స్ ను 28 శాతం శ్లాబ్ లో చేర్చారు. దీంతో రేట్లు తగ్గాయి. ఆ మేరకు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని టూ వీలర్ షోరూం యజమానులు చెబుతున్నారు. 350 సీసీ లోపు వాహనాలపై టాక్స్ రేటు రెండు శాతం పైగా తగ్గిందని , దీంతో హీరో కంపెనీ మోడల్స్ పై వేయి రూపాయల నుండి 3 వేల రూపాయల మద్యలో తగ్గాయి. హీరో ప్యాషన్ మోడల్ పై 1234 రూపాయలు , గ్లామర్ మోడల్ ధర 1325 రూపాయలు , స్ప్లెండర్ ధర 2 వేల రూపాయలు , ఫ్లెజర్ స్కూటర్ ధర 960 రూపాయలు తగ్గిందని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో సేల్స్ భారీగా పెరగలేదని అంటున్నారు. ఇప్పటి వరకు అన్ని మోడల్స్ పై ధరలు ఖచ్చితంగా అందలేదని , దీని కోసం మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం వుందని చెబుతున్నారు.

అదే విధంగా యమహా మోటార్స్ ధరలు కూడా వేయి నుండి మూడు వేల వరకు తగ్గాయి. హోండా మోటార్స్ కూడా తగ్గిన రేట్లతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. హోండాలో హార్నెట్ ధర 2 వేల 185 రూపాయలు తగ్గగా , యూనికార్న్ 1400, షైన్ 1534, డ్రీమ్ యుగ 1325, యాక్టీవా 1461, యాక్టీవా 4జీ 1114 రూపాయలు తగ్గాయని జూలై ఒకటి నుండి కొత్త రేట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఇప్పటికీ సీట్లు, కొన్ని విడిభాగాలు ముందు కొన్నవే వాడుతున్నామని , మరికొన్ని రోజులైతే ధరలు మరి కాస్తా తగ్గే అవకాశం వుందని చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories