పెళ్లికి కొద్ది నిమిషాల ముందు...వరుడు జంప్

Submitted by arun on Tue, 09/04/2018 - 10:14

మూడు ముళ్లు వేయడానికి కొన్ని నిమిషాల ముందు పెళ్లి కొడుకు పరారైయ్యాడు. ఎంతో అంగరంగ వైభవంగా వేదమంత్రోత్సహలతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరగాల్సిన కల్యాణ వేదికలో పెళ్లి కూతురు కన్నీరు మున్నీరై విలపించింది. న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించింది నూతన వధువు.

కృష్ణా జిల్లాలో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. తోట్లవల్లూరు మండలం రోయ్యూరు గ్రామానికి చెందిన మేరుగ నాగార్జున పెద్ద కుమార్తె దివ్యకు పామర్రు మండలం నిబానుపూడి గ్రామానికి చెందిన నాగ శీనుతో  రెండు నెల క్రితం వివాహం నిశ్చితార్ధం జరిగింది. సెప్టెంబర్ 2 ఆదివారం రాత్రి 9.51 నిమిషాలకు ముహుర్తం కూడా పెట్టుకున్నారు. ఇరు కుటుంబాలు అన్ని పెళ్లి ఏర్పాట్లు చేశారు. ముహుర్తానికి కొన్ని నిమిషాల ముందు పెళ్లి కొడుకు అరిసే నాగ శీను పరారయ్యాడు. 

ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత పెళ్లి కొడుకు నాగశీను ప్రతి రోజు దివ్యను తన వాహనంపై ఎక్కించుకొని ఇంటి దగ్గర దించేవాడు. ఈ క్రమంలోనే నాగశీను దివ్య కదలికలను ఎప్పటికపుడు కనిపెట్టేందుకు ఆమె ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఆమె ఎవరితో మాట్లాడిన వెంటనే నాగ శీను తెలిసిపోయేది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న దివ్య నాగశీను మాట్లాడటం మానేసింది. 

పెళ్లికూతురు దివ్యపై అనుమానం పెంచుకున్న నాగశీను పెళ్లికి నిరాకరించి పరారయ్యాడు. తనపై లేనిపోని అబాండాలు మోపిన పెళ్లికొడుకు అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు దివ్య డిమాండ్ చేసింది. బంధువులతో కలిసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది.   

Tags
English Title
Groom spies on bride, she files a complaint

MORE FROM AUTHOR

RELATED ARTICLES