ఏపీ విషయంలో.. ఇద్దరూ ఇద్దరే!

Submitted by arun on Fri, 03/16/2018 - 11:26
narendra modi sonia gandhi

ఆంధ్రప్రదేశ్ కు నాడు కేంద్రంలో ఉన్న యూపీయే ప్రభుత్వం ఎంతటి అన్యాయం చేసిందో.. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా అంతకన్నా అన్యాయం చేస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించింది. విభజన చట్టాన్ని రెండు తెలుగు రాష్ట్రాలూ నష్టపోయేలా గందరగోళంగా రూపొందించింది. ఏపీకి రైల్వే జోన్ విషయంలో స్పష్టత లేని విధానాన్ని పొందు పరిచింది.

ఇప్పుడు.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ మాట అక్షర సత్యం అని ఎవరైనా ఒప్పుకుంటారు. చట్టంలో చెప్పామని కాంగ్రెస్ అంటుంటే.. కేవలం సాధ్యాసాధ్యాలు మాత్రమే పరిశీలించాలని చట్టంలో ఉందని పీయూష్ గోయల్ చెబుతున్నారు. ఇప్పటికీ.. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాలను పరిశీలిస్తున్నామని అంటున్నారు. కానీ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతోంది కదా.. ఇప్పటికీ ఈ విషయాలను ఆలోచిస్తూనే ఉన్నారా? అని ఆంధ్రా ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు.. జీఎస్టీ అమలు లాంటి సంస్కరణలకు.. కేంద్రం అధికారంలోకి వచ్చాకే నిర్ణయాలు తీసుకుంది. కానీ.. 2014 ఎన్నికలకు ముందే నిర్ణయమైన విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంపై ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తున్నారంటూ.. ఏపీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పద్ధతి, పాడూ లేకుండా విభజన చేసి.. రెండు రాష్ట్రాలకూ నష్టం కలిగేలా చేసి.. ఇప్పుడు మాత్రం వెటకారం ఆడుతున్నారంటూ సీరియస్ అవుతున్నారు.

ఏపీ ప్రజల ఆగ్రహం.. ఎటు దారితీస్తుందో.. ఎవరికి పొగ పెడుతుందో అన్నది.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

English Title
Goyal r further blamed the Congress for creating problems in AP

MORE FROM AUTHOR

RELATED ARTICLES