అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కదిలిన బాలిక

Submitted by arun on Sat, 12/30/2017 - 19:21
Girl

విజయవాడ నగరంలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలిక ప్రాణాలతో ఉండగానే మృతిచెందినట్టు వైద్యులుల ధ్రువీకరించారు. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 
విజయవాడకు చెందిన సాయిదుర్గ అనే బాలిక కళ్లు తిరిగి పడిపోయింది. సుమారు పదినిమిషాల పాటు బాలిక కళ్లు తెరవకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు మాత్రం బాలికకు ఏం జరిగింది? ఏమైందనే విషయాన్ని ఆరా తీయకుండానే చనిపోయిందని ‘డెత్ సర్టిఫికెట్’ ఇవ్వడం గమనార్హం. రోగులను ఆస్పత్రికి తీసుకెళితే మొదట చేసేది ప్రాథమిక చికిత్స.. అయితే అవన్నీ ఏం పట్టించుకోకుండా.. అసలు రోగి ఎలా ఉన్నారు ఏమైందని కనీసం తెలుసుకోకుండానే.. ఇలా చనిపోయిందని చెప్పడం సిగ్గుచేటని నిపుణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

నిన్న రాత్రి 11గంటలకు సాయిదుర్గను అంబులెన్స్‌లో రాజరాజేశ్వరిపేటలోని ఇంటికి తరలించారు. అంబులెన్స్‌ డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వలేదని మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వకుండా వెళ్లిపోయాడని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సాయిదుర్గ కదిలినట్లు గుర్తించిన బంధువులు స్థానిక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలిక గుండె కొట్టుకుంటుందని చెప్పడంతో మళ్లీ సాయిదుర్గను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాయకరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాయిదుర్గ చికిత్స పొందుతోంది. దుర్గ తండ్రి శ్రీను స్థానికంగా చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ కలహాలతో ఇటీవలే శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీరుపై బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతికుండానే చనిపోయిందని మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారని మండిపడుతున్నారు.

English Title
govt hospital negligance

MORE FROM AUTHOR

RELATED ARTICLES