ఏపీ ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబుపై ఎదురుతిరిగిన ఉద్యోగులు

Submitted by arun on Sat, 08/11/2018 - 16:38
 govt employees

ఏపీ ఎన్జీవో నేత అశోక్‌ బాబుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎదురుతిరిగాయి. సీపీఎస్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఎస్‌ రద్దు కోసం విజయవాడలో ఫ్యాప్టో నిర్వహించిన సభలో అశోక్‌ బాబు ప్రసంగిస్తుండగానే ఉద్యోగులంతా అశోక్‌బాబుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చేతులు పైకెత్తి ప్రసంగం వద్దు వద్దంటూ నినాదాలు చేశారు. అశోక్‌బాబుది ప్రభుత్వ అనుకూల వైఖరి అని పోటీ సభలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓ వైపు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నా అశోక్‌ బాబు మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

English Title
govt-employees-protest-against-cps

MORE FROM AUTHOR

RELATED ARTICLES